VZM: జిల్లాలో క్షయ (టీబీ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ‘క్షయ వందరోజుల కార్యక్రమం’ను అమలు చేస్తున్నట్లు డీఎంహెచ్వో జీవన రాణి తెలిపారు. సోమవారం తమ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం రేపటి నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ముందస్తు గుర్తింపు, సమయానికి చికిత్స ద్వారా వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు.