GDWL: గట్టు మండల పరిధిలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మూడు మొబైల్ ఫోన్లను సోమవారం పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శేఖర్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫోన్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు అనంతరం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.