ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని అర్చకులకు జగన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. విజయదశమి (Vijayadasami) సందర్భంగా అర్చకులకు కనీస వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 26 జిల్లాల్లోని 1,177 మంది అర్చకులకు (Priests) కనీస వేతనం అందనుంది. వేతనాన్ని రూ.15,625కు చేర్చుతూ దేవాదాయ శాఖ కమిషనర్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు సీఎం జగన్ (Cm Jagan) శుక్రవారం విజయవాడ (Vijayawada) కనకదుర్గమ్మ వారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అలాగే అమ్మవారికి పసుపు, కుంకుమను సమర్పించి ఆలయ అధికారులతో సమావేశం కానున్నారు. రేపు కనకదుర్గమ్మ జన్మనక్షత్రం సందర్భంగా విజయవాడకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సరస్వతీ దేవి రూపంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ తరుణంలో ఆలయ అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.