MLG: రైతును రాజు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి అన్నారు. ములుగు నియోజకవర్గంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం రైతుభరోసా నిధులను విడుదల చేయడం హర్షణీయమని, రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, రైతులు ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు.