»Dandiya Dance Of Women In Kerala Video Shared By Shashi Tharoor
Keralaలో మహిళల దాండియా నృత్యం..వీడియో షేర్ చేసిన శశి థరూర్
అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్ .. కేరళ స్టైల్ దాండియా' అంటూ కాంగ్రెస్ నేత శశీథరూర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళ మహిళలు దాండియా ఆడే స్టైల్ చాలా వెరైటీగా ఉంది.
దసరా నవరాత్రుల సందర్భంగా కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ (Shashi Tharoor tweet) చేశారు. ‘అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్(Gujarati Sisters).. ఈ నవరాత్రులకు కేరళ స్టైల్లో దాండియా డాన్స్’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్దపెద్ద కర్రలతో మహిళలు దాండియా ఆడుతున్న వీడియోను చూసి నెటిజన్లు (Netizens) ఫిదా అవుతున్నారు. దసరా పండుగ, దుర్గాష్టమి నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.
మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఒకే పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిలో చేసుకుంటారు.గుజరాత్(Gujarat), రాజస్థాన్ రాష్ట్రాల్లో నవరాత్రుల సందర్భంగా దాండియా నృత్యం చేస్తుంటారు. మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి లయబద్ధంగా చేసే ఈ డాన్స్ (Dance) చాలా ఫేమస్. అయితే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనేగాక ఇతర రాష్ట్రాల్లోని గుజరాతీలు, రాజస్థానీలు కూడా స్థానిక మహిళలతో కలిసి దసరా నవరాత్రుల సందర్భంగా దాండియా ఆడుతారు. ఈ నేపథ్యంలో కేరళలో మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.
‘అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టైల్లో (Kerala style) దాండియా నృత్యం’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్‌ను జతచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పెద్దపెద్ద కర్రలతో మహిళలు దాండియా ఆడుతున్న వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఈక్రమంలో ‘అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్.. ఈ నవరాత్రులకు కేరళ స్టైల్లో దాండియా నృత్యం’ అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా(Social media)లో తెగ వైరలవుతోంది. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని మహిళలు దాండియా నృత్యం చేస్తున్న వీడియోపై నెటిజన్స్ కూడా తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.