KDP: ఎర్రగుంట్లలో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న రైలులో మహిళ వద్ద బంగారు నగలు చోరీ జరగటంతో.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గుంటూరు-తాడిపత్రి మార్గంలో ధర్మవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేరళకు చెందిన మహమ్మద్ సవాద్ను అదుపులోకి తీసుకుని 75 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.