BDK: మణుగూరులో విషాదం చోటుచేసుకుంది. రాజీవ్ కంప్యూటర్స్ నిర్వహకుడు ఓబులాపూర్ రాజు ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. వేణు రెస్టారెంట్ సమీపంలో ఉన్న తన కంప్యూటర్ సెంటర్లో ఉండగానే ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రాజు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగారు.