తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఏపీ హైకోర్టు (Ap HighCourt) మరోసారి షాకిచ్చింది. ముందస్తు బెయిల్‌పై విచారణను మరోసారి వాయిదా వేస్తూ ప్రకటించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటీషన్ వేయగా దాని విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 7వ తేదికి వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల వ్యవహారంలో కోర్టుల్లో పిటీషన్లపై విచారణలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏసీబీ కోర్టు (ACB Court) నుంచి సుప్రీం కోర్టు (Supreme Court) వరకూ వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. వాయిదాల పర్వం కడా కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Developement Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పును సుప్రీం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఫైబర్‌నెట్ కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Inner Ring Road Case)తో పాటుగా పీటీ వారెంట్‌పై కూడా స్టే ఇవ్వాలంటూ చంద్రబాబు హైకోర్టులో పిటీషన్ వేయడంతో దాని విచారణను నవంబర్ 7వ తేదికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఐఆర్ఆర్ కేసులో మాజీ మంత్రి నారాయణ కూడా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
మరోవైపు చంద్రబాబు ఆరోగ్యం (Chandrababu Health)పై ఆయన కుటుంబీకులు, కార్యకర్తలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బాబును జైలులోనే చంపేందుకు వైసీపీ (YCP) కుట్ర చేస్తోందని టీడీపీ (TDP) నేతలు పలు ఆరోపనలు చేస్తున్నారు. బాబును వెంటనే జైలు నుంచి విడిపించాలని పలు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్న సంగతి తెలిసిందే.