»Changes In Ap Dussehra Holidays Jagan Sarkars Key Announcement
Dussehra Holidays: ఏపీ దసరా సెలవుల్లో మార్పులు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో దసరా సెలవు రోజును మార్చుతూ జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయదశమి రోజును అక్టోబర్ 24వ తేది మార్చుతూ ఆ రోజున సెలవుదినంగా ప్రకటించింది. దీంతో రెండు రోజుల పాటు ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలు మూత పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో దసరా పండగ (Dussehra Festival) సందర్భంగా ఇప్పటికే విద్యార్థులకు దసరా సెలవులు (Dussehra Holidays) ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దసరా సెలవుల విషయంలో జగన్ (Cm Jagan) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో విజయదశమి (Vijayadasami) సెలవును మార్చివేసి ఆ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. మొదట అక్టోబర్ 23వ తేదిన సోమవారం రోజు అధికారిక సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ఆ నిర్ణయాన్ని మారుస్తూ ప్రకటన చేసింది. తాజాగా అక్టోబర్ 23, 24వ తేది అంటే సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటూ సెలవును ప్రకటిస్తూ జగన్ సర్కార్ అధికారిక ఉత్తర్వులను (Announcement) విడుదల చేసింది. దీంతో ఆ రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లోని ఉద్యోగులు సెలవు (Dussehra Holiday) తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో (Schools) అక్టోబర్ 14వ తేది నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 24వ తేది వరకూ ఆ సెలవులు ఉంటాయి. పాఠశాలలు తిరిగి అక్టోబర్ 25వ తేదిన తెరుచుకోనున్నాయి. రెండు రోజుల పాటు దసరా సెలవులను సర్కార్ ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.