ATP: తాడిపత్రిలోని చారిత్రక శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తుల నినాదాలతో శివనామస్మరణతో మార్మోగింది.