VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు విశాఖ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.