KNR: హైదరాబాద్లో జరిగిన పద్మశాలి- 2026 ఉగాది పురస్కారాల్లో జమ్మికుంట మండలం ధర్మారానికి చెందిన కందికట్ల పద్మకు సేవా అవార్డు అందించారు. ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మహిళలకు టైలరింగ్ శిక్షణ, కాటన్ బ్యాగుల తయారీ, మహిళలకు ఉపాధి కల్పనలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.