AP: చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో 99 శాతం అభివృద్ధి పనులు YCP అధికారంలో ఉండగా చేశామని మాజీమంత్రి రోజా అన్నారు. ‘పుత్తూరులో అందమైన షాదీమహల్ నిర్మించాం. అది పూర్తయినా ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా ఉంచారు. జగన్ పాలనలో మూడేళ్లలో 4 అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించాం. పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం’ అని పేర్కొన్నారు.