AP: కోనసీమ జిల్లా కుందాలపల్లిలో కుల వివక్షకు గురైన బాధితులను జై భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పరామర్శించారు. ఈ మేరకు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుందాలపల్లిలో దళితులపై వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఎస్సీ వర్గాలపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తానే న్యాయవాదిగా ఉండి వాదిస్తానని స్పష్టం చేశారు.