నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో ఒక ఇంటర్ విద్యార్థి తన ఆన్సర్ షీట్లో రాసిన వింత రాతలు SMలో వైరల్ అవుతున్నాయి. ‘నేను చదివినవి రాలేదు.. మీరే నా దేవుడు, ప్లీజ్ నన్ను పాస్ చేయండి సార్’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా.. సార్ కాళ్లు మొక్కుతున్నట్లు ఒక బొమ్మ గీసి బతిమిలాడడం విశేషం. ఇది చూసిన నెటిజన్లు ‘పాస్ చేయండి సర్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.