HNK: బీజేపీ పార్టీ కార్యకర్తలు నిస్వార్ధంగా సైదాంతిక నిబద్ధతతో పనిచేయాలని కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీప్రసాద్ రావు అన్నారు. ఆత్మకూరు మండల దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.