TG: బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతులను మారుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందరికీ రూ.5 లక్షల బీమా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కోటీ 15 లక్షల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అనేది దేశంలో ఎక్కడా లేదన్నారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు మధ్యాహ్న భోజనం పెడుతున్నామని వెల్లడించారు.