AP సముద్ర జలాల్లోకి తమిళనాడు మత్స్యకారుల అక్రమ ప్రవేశంపై CM చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టాలని కోరుతూ TN సీఎం స్టాలిన్, కేంద్రానికి లేఖలు రాశారు. ఈ చొరబాట్ల వల్ల ఏపీలోని 162 గ్రామాల మత్స్యకారుల ఉపాధికి ముప్పు వాటిల్లి, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య రాకముందే నిబంధనలపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.