MDK: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మనోహరాబాద్ మండలం పోతారంలో మిషన్ భగీరథ విభాగం, సర్పంచ్ పుట్ట వినోద ఆధ్వర్యంలో జల మహోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ కిరణ్ మాట్లాడుతూ.. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, జలవనరులను సంరక్షిస్తేనే భవిష్యత్ తరాల మనుగడ సాధ్యమని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.