ADB: మహబూబాబాద్ జిల్లా కమిటీ ఎన్నికల కోసం వెళ్తున్న ఆదివాసీలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాపూరావు అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో రాగల్ జెండా కమిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఆదివాసీల హక్కుల కోసం ఎవరికీ భయపడకుండా పోరాడాలని ఉద్యమకారులకు సూచించారు.