AKP: మునగపాక(మం) తోటాడ సెంటర్లో గ్యాస్ సిలిండర్ లీకేజీతో చికెన్ షాప్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కనకదుర్గ చికెన్ సెంటర్లో మంటలు వ్యాపించి సుమారు 20 కోళ్లు, సామాగ్రి, విద్యుత్ మీటర్ కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.30 వేల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.