AKP: సీఎం చంద్రబాబు బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు కోటవురట్ల మండలానికి 60 బస్సులు కేటాయించినట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. బహిరంగ సభకు తరలి వెళ్లే ప్రజలకు ఫుడ్ పాకెట్స్ అందించేందుకు జల్లూరు, కోటవురట్ల, రామచంద్రపాలెం వద్ద మూడు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భోజనాలను టీడీపీ నాయకులు తయారు చేస్తున్నారు.