BPT: బల్లికురవ మండలానికి చెందిన రైతులకు సేంద్రీయ వ్యవసాయం, దేశవాళీ ఆవుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో కూంఓట్లపల్లి గ్రామంలోని క్షేత్రశాల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు దేశవాళీ ఆవుల పెంపకం వల్ల కలిగే లాభాలు, ఆదాయం పొందే మార్గాలు, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై క్షేత్రశాల సిబ్బంది వివరించారు.