విశాఖలోని జ్ఞానాపురంలో నివసిస్తున్న అనాథ వృద్ధురాలు కోటిపల్లి లక్ష్మి ఆదివారం మృతి చెందింది. స్థానికులు స్పందించి అవర్ హ్యాండ్స్ సేవా సంస్థకు సమాచారం అందించారు. సంస్థ ప్రతినిధి పిల్లి గోవిందరాజు ముందుకు వచ్చి హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. కాన్వెంట్ జంక్షన్ సమీప దహనవాటికలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.