GDWL: రాజోలి రైతు వేదిక సమీపంలో రాత్రివేళల్లో కొందరు మద్యం తాగి స్థానికులను ఇబ్బంది కలిగిస్తున్నారు. పక్కనే తహసీల్దార్ కార్యాలయం ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే వారు అక్కడ పడి ఉన్న మద్యం సీసాలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు వెంటనే కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.