GDWL: గత వారం అనివార్య కారణాలతో ఆగిపోయిన ప్రజావాణి రేపటి నుంచి యథావిధిగా సాగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం (రేపు) గద్వాల కలెక్టరేట్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలు వినడానికి ప్రభుత్వం ముందుంటుందన్నారు.