ADB: సామజిక చైతన్యానికి సాహిత్యమే ఊపిరి అని సాహితి వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గోపగాని రవీందర్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ సాహితి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలోని చెడును రూపుమాపడానికి కవులు, రచయితలు తమ రచనల ద్వారా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.