SRD: ఏప్రిల్ నెలలో మహనీయుల మాసంగా ప్రకటించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల భోజనంపై గరికపాటి వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో దళితులకు మొండి చేయి చూపిందని ఆరోపించారు.