WGL: నగరంలోని 41వ డివిజన్ బక్షిమొహాల్లా కాలనీలో మోరీల పరిస్థితి ఇది. ఈ ప్రాంతంలో మోరీలు తీసేవారు లేక స్థానికులే స్వయంగా మోరీలు క్లీన్ చేస్తున్నారు. చెత్తా, చెదారంతో మోరీలు నిండి తాము ఇబ్బందులు గురవుతున్నామని, అనారోగ్య పాలవుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. బల్దియా అధికారులు స్పందించి, మోరీలు శుభ్రపరచాలని కోరుతున్నారు.