KRNL: కోడుమూరు పట్టణంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న డాక్యుమెంట్ రైటర్ గంగాధర్ (39) ఆదివారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల కోడుమూరు డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ సభ్యులు, మిత్రులు సంతాపం వ్యక్తం చేశారు. గంగాధర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేశారు. ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.