SDPT: కనీస మద్దతు ధరతో పాటు వరికి బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నర్మెటలో జరుగుతున్న రైతుమేళా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘లాభసాటి పంటల దిశగా రైతులు ఆలోచన చేయాలి. మనకు అవసరం ఎక్కువ ఉన్న పంటలకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలనేది సీఎం ఆలోచన. రాష్ట్రంలోనే తొలిసారిగా రిఫైనరీని కూడా సిద్ధిపేట జిల్లాలోనే నిర్మిస్తున్నాం’ అని పేర్కొన్నారు.