TG: ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రతి పేద వాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం తమ పింక్ పేపర్లో ఈ ఫ్యాక్టరీ తమ హయాంలో కట్టిందని రాశారని చెప్పారు. ఇకపై ఇలాంటి తప్పుడు ఆరోపనలు మానుకోవాలని సూచించారు.