AP: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి వివాదాస్పద వ్యాఖ్యలపై సీపీఐ నారాయణ స్పందించారు. ‘ఒక రకంగా నేను గరికపాటి అభిమానిని. అన్ని ఉపన్యాసాలలో గరికపాటి చేసిన ఈ ప్రసంగం ఆయన వ్యక్తిత్వానికి తగినది కాదు. గరికపాటి మధ్యాహ్న భోజనంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’ అంటూ ఆయన డిమాండ్ చేశారు.