What Happened In Amit Shah Meeting Atchannaidu Explained
Atchannaidu: కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నారా లోకేశ్ మీట్ అయ్యారు. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీని గురించి ఏపీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లోకేశ్ కలిశారని.. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారని తెలిపారు. లోకేశ్ వెళ్లేసరికి ఏపీ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అక్కడ ఉన్నారని చెప్పారు. అంతే తప్ప వారితో కలిసి వెళ్లలేదని స్పస్టం చేశారు.
అమిత్ షా- లోకేశ్ భేటీ వెనక ఎలాంటి ప్రణాళిక లేదని.. ఏపీ పరిస్థితులను మాత్రమే వివరించారని తెలిపారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండగా.. ఆయనను బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీ, లోకేశ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతలో అమిత్ షాను లోకేశ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమిత్ షాతో భేటీ గురించి ఈ రోజు ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు నారా లోకేశ్. అమిత్ షా తనను కలువాలని అనుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫోన్ చేశారని వివరించారు. దీంతో వెళ్లి చంద్రబాబు అరెస్ట్, తర్వాతి పరిస్థితులను వివరించానని పేర్కొన్నారు. ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పానని తెలిపారు. భద్రతాపరంగా ఉన్న ఆందోళన గురించి చెప్పానని పేర్కొన్నారు. బీజేపీ చేయిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారని అమిత్ షాకు తెలిపానని.. తాను అనుకోవడం లేదన్నారు. నిజం వైపు ఉండాలని కోరానని వివరించారు. బాబు అరెస్ట్‌తో తమకేం సంబంధం లేదని అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది.
లోకేశ్ వెళ్లే సరికి అక్కడ కిషన్ రెడ్డి, పురందేశ్వరి ఉన్నారని అచ్చెన్నాయుడు అనగా.. కిషన్ రెడ్డి ఫోన్ చేయడంతో తాను వెళ్లానని నారా లోకేశ్ చెప్పారు. ఈ రెండింటీలో డిఫరెన్స్ కనిపించడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.