»12 Years Girl Agasthi Direct A Kundan Satti Animation Movie
Kundan Satti Movie: యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించిన చిన్నారి
ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా మొబైల్స్‌కి ఎడిక్ట్ అయిపోతున్నారు. రోజంతా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. కానీ 12 ఏళ్ల పీకే అగస్త్యి మాత్రం ఏకంగా యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
Kundan Satti Movie: పన్నెండేళ్ల వయస్సులో మీరేం చేసుంటారని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరేం చేబుతారు. స్కూల్‌కి వెళ్లడం, చదువుకోవడం, ఆటలు ఆడుకోవడం వంటివి చేసేవారమని చెబుతారు. కానీ ఇదే ప్రశ్నను పీ.కె అగస్త్య అనే చిన్నారిని అడిగితే..యానిమేషన్ సినిమా తీశానని చెబుతుంది. మీరు విన్నది నిజమే. 5వ తరగతి చదువుతున్న ఈ 12ఏళ్ల చిన్నారి ‘కుందన్ శట్టి'(Kundan Satti) అనే యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ వయస్సులో సినిమా తీయాలనే ఆలోచన రావడమే గొప్ప. అలాంటిది సినిమాను తెరకెక్కించిందంటే మామూలు విషయం కాదు. అగస్త్యి తండ్రి డాక్టర్. సినిమా తీయాలనే తన ఆలోచనను తండ్రితో పంచుకుంది. కూతురి ఆలోచనను గౌరవించి ఆ తండ్రి ఆమెను ప్రోత్సహించారు.
సినిమా ట్రైలర్ చూసిన పలువురు చిత్ర ప్రముఖులు చిన్నారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. ఒక గ్రామంలో ఒకేసారి పుట్టిన ఇద్దరు పిల్లలు స్నేహితులు అవుతారు. గ్రామంలో జరుగుతున్న అక్రమాలను వీళ్లు ఎలా ఆరికట్టారు? అనే విషయాలపై సినిమా తీశారు. తమిళంలో రానున్న ఈ సినిమాలో మూడు పాటలు కూడా ఉన్నాయి. ఓ స్కూల్ విద్యార్థి ఈ సినిమాను తెరకెక్కించడంతో విద్యార్థుల వికాసాన్ని పెంపొందించే విధంగా ఈ చిత్రం ఉంటుందని..రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి అమర్గీత్ సంగీతాన్ని అందించారు.