'యానిమల్' చిత్రం నుంచి ఇటివల వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో రణబీర్, రష్మిక లిప్‌లాక్ కనిపిస్తుంది. ఆన్‌స్క్రీన్‌పై భర్త లిప్‌లాక్‌పై ఆలియా రియాక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Aliya Bhat: రణబీర్ కపూర్, రష్మిక మందనా కాంబోలో రానున్న చిత్రం ‘యానిమల్’. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి బ్లాక్‌బ్లస్టర్ హిట్స్ అందించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలయ్యింది. దీనిని చూసిన తర్వాత ప్రేక్షకులకు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మొదటిపాట విడుదలయ్యింది. ఆ పాటలో రష్మిక, రణబీర్ మధ్య రొమాన్స్ అర్జున్ రెడ్డికి సీక్వెల్లా ఉంది. హిందీ, తెలుగు భాషల్లో రానున్న ఈ చిత్రం.. లిరికల్ వీడియో కాకుండా ఫుల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.
తెలుగులో ‘అమ్మాయి’గా విడుదలైన ఈ పాటలో రష్మిక, రణబీర్ ఇంటి నుంచి జెట్ విమానంలో వెళ్లిపోయి మంచుకొండల మధ్యలో వివాహం చేసుకుంటారు. ఆ జెట్ విమానంలో రణబీర్, రష్మిక లిప్‌లాక్ చేసుకుంటారు. పెళ్లయిన తర్వాత వేరే హీరోయిన్‌తో ఆన్‌స్క్రీన్‌పై రణబీర్ లిప్‌లాక్ ఇవ్వడంతో ఆలియా రియాక్షన్ ఏంటని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే గతేడాది రణబీర్, ఆలియాకు వివాహం జరిగింది.
ఈక్రమంలోనే స్పందించిన ఆలియా ‘లూప్‌లో ప్లే’ అవుతుందని తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పాట నాకు బాగా నచ్చిందని రణబీర్‌కు సపోర్ట్ చేసింది. భర్త లిప్‌లాక్‌ను ఆలియా ఎంత స్పోర్టివ్‌గా తీసుకుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమాల్లో పెళ్లయిన హీరోయిన్స్ వేరే హీరోతో రొమాన్స్ చేయడం కరెక్ట్ కాదని కొందరు విమర్శిస్తుంటారు. కానీ హీరోలకు మాత్రం అలాంటి రూల్స్ ఉండవు. అదే బాలీవుడ్లో అయితే ఎలాంటి కండీషన్స్ ఉండవు. హీరో, హీరోయిన్‌కి స్క్రీన్‌పైన కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందా లేదా అనేది మాత్రమే ముఖ్యం.