మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గురించి అందరికీ తెలిసిందే. సినిమా కోసం ఏదైనా చేయడంలో దాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. అలాంటి దాస్‌కు షూటింగ్లో గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి మాస్ కా దాస్‌కు ఎలా ఉంది?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen)కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే. అందుకే.. రీసెంట్గా తన అభిమాన హీరో ‘అదుర్స్’ సినిమా రీ రిలీజ్ సందర్భంగా.. ట్రైలర్ రిలీజ్ చేశాడు విశ్వక్ సేన్. ఇక.. తన లేటెస్ట్ ఫిల్మ్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో డిసెంబర్ 8న ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. హాట్ బ్యూటి నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్లో సాగే పొలిటికల్ విలేజ్ డ్రామాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెరక్కుతోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే చెబుతోంది.
అయితే.. ఈ సినిమా షూటింగ్లో విశ్వక్ సేన్‌కు గాయాలయ్యాయి(Injuries) అనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ చేస్తున్నప్పుడు విశ్వక్ సేన్ కాలికి గాయమైందట. అయితే.. ఇది ఇప్పుడు జరిగింది కాదట. కొన్ని రోజుల క్రితమే జరగగా.. ప్రస్తుతం అంతా సెట్ అయిందని తెలుస్తోంది. కాబట్టి.. మాస్ కా దాస్ ఫ్యాన్స్‌కు ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. చివరగా దాస్ కా ధమ్కీ సినిమాతో మంచి హిట్ కొట్టిన విశ్వక్.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతోను మాసివ్ హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు. ఈ సినిమాతో పాటు ఇంకొన్ని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో గామి అనే సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.