గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది మరోసారి జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ‘గౌతమ్ నంద’, ‘సిటిమార్’ వంటి చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇరువురు తమ ప్రస్తుత సినిమాలను పూర్తి చేసిన తర్వాత, ఈ కొత్త చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.