Raja Singh: ఇండిపెండెంట్‌గా పోటీ చేసే ప్రసక్తే లేదు
ఆరు నెలల కిందట వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా..రాజాసింగ్ పోటీపై రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Raja Singh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గోషామహాల్ ఎమ్మైల్యే రాజాసింగ్ ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నామినేషన్‌కు ఇంకా చాలా సమయం ఉందని.. అప్పటిలోగా బీజేపీ తనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగిస్తుందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. లేదంటే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో తన పేరే మొదట ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో తనకు కాకుండా బీజేపీ టికెట్ ఎవరికి వచ్చినా తాను సపోర్ట్ చేస్తానని చెప్పారు. బీజేపీ పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. పార్టీ నాయకులు మద్ధతు కూడా తనకు ఉందన్నారు. సస్పెన్షన్ ఎత్తి వేయకపోతే ఇండిపెండెంట్‌గా పోటీచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టికెట్ రాకపోతే హిందూ ధర్మం కోసం పనిచేస్తానని రాజాసింగ్ వెల్లడించారు.
గతంలో పలు విమర్శల నేపథ్యంలో బీజేపీ నుంచి ఆరు నెలల కిందట రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. అప్పట్లో తన సస్పెన్షన్ ఎత్తేస్తారని ప్రచారం జరిగినా ఇప్పటివరకు తన సస్పెన్షన్ మాత్రం తొలగించలేదు. ఈ క్రమంలోనే ఇటివల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో అతనికి బీజేపీ ఈసారి టికెట్ ఇస్తుందా లేదా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.