తన IPL కెరీర్లో 2021 సీజన్ అత్యంత దారుణమైనందని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ‘కొవిడ్ సోకిన తొలి ప్లేయర్ నేనే. భుజం నొప్పితో బయోబబుల్ నుంచి బయటకు రావడంతో నాకు, నా నుంచి సందీప్ వారియర్‌కు సోకింది. ఆపై టోర్నీని మధ్యలో ఆపేశారు’ అని గుర్తుచేశాడు. దీంతో తమకు వినోదమిచ్చే IPL తన వల్లే ఆగిపోయిందంటూ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారని.. ‘బతికే ఉన్నావా’ అనేవారని తెలిపాడు.