»A Fans Vow Post That He Will Get Married After Completing His 50th Century
Virat Kohli: వీరాభిమాని శపథం..50వ సెంచరీ చేశాకే పెళ్లి చేసుకుంటానంటూ పోస్ట్
విరాట్ కోహ్లీ వీరాభిమాని ఓ పోస్టర్‌తో గ్రౌండ్లో ప్రత్యక్షమయ్యాడు. కోహ్లీ 50వ సెంచరీ చేస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ప్లకార్డుతో చెప్పడంతో గ్రౌండ్ లోని క్రికెట్ అభిమానులంతా నవ్వుకున్నారు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 47 వన్డే సెంచరీలు ఉన్నాయి.
వన్డే వరల్డ్ కప్ (ODI World Cup -2023)లో భాగంగా నేడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం వరల్డ్ కప్ 9వ మ్యాచ్ జరగుతోంది. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులు సందడి చేస్తున్నారు. అందులో ఓ వీరాభిమాని పెట్టిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Poster Viral) అవుతోంది. స్టేడియం వద్ద క్రౌడ్‌లో ఆ అభిమాని పోస్టర్ చూసి అందరూ నవ్వుకున్నారు. తన చేతిలోని పోస్టర్లో కోహ్లీ 50వ వన్డే సెంచరీ చేసిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని శపథం చేస్తున్నట్లు తెలిపాడు.
ప్లకార్డు పట్టుకున్న వ్యక్తిని గ్రౌండ్ కెమెరా మ్యాన్ గుర్తించడంతో ఆ వీరాభిమానిని, అతని పోస్టర్‌ను పలుమార్లు బిగ్ స్క్రీన్‌పై షో చేయడంతో గ్రౌండ్ లోని క్రికెట్ అభిమానులంతా (Cricket Fans) ఊగిపోయారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 47 వన్డే సెంచరీలు ఉండగా ఆ అభిమాని పెళ్లి చేసుకోవడానికి మరో మూడు సెంచరీలను కోహ్లీ చేయాల్సి ఉంది.
వన్డే ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లోనే కోహ్లీ ఓ సెంచరీ (Century) చేసి ఉండాల్సింది. అయితే కోహ్లీ ఆ మ్యాచ్‌లో 85 పరుగుల వద్ద అవుట్ అయ్యి సెంచరీ మిస్ అయ్యాడు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ (Team India) విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో కోహ్లీ ఓ అరుదైన రికార్డును (Kohli Record) కూడా సొంతం చేసుకున్నాడు.
ఇండియన్ దిగ్గజ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. తొలి వన్డేలో 85 పరుగుల చేయడంతో ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో (ICC) అటు వన్డే ప్రపంచ కప్, టీ20 వరల్డ్ కప్, ఇటు ఛాంపియన్స్ ట్రోఫీల్లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా విరాట్ కోహ్లీ రికార్డును సాధించాడు. గతంలో ఆ రికార్డు సచిన్ పేరుపై ఉండేది. ఇప్పుడు సచిన్‌ను వెనకకు నెట్టి కోహ్లీ (Kohli) మొదటి స్థానంలో నిలిచాడు.