KKD: పిఠాపురం మార్కెట్లో ఆదివారం చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణ చికెన్ కిలో రూ.280 ఉండగా, స్కిన్లెస్ రూ. 350, బోన్ లెస్ రూ. 420 వరకు విక్రయిస్తున్నారు. నాటుకోడి ధర రూ. 600కు చేరింది. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరగడంతో మాంసం ప్రియులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారిగా రేట్లు పెరగడంతో సామాన్యులు చికెన్ కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.