NLR: సంగం వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి సీఐ శ్రీనివాస రెడ్డి, S1 రాజేశ్ విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. అలాగే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా బైకులు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.