NLG: తాటి చెట్టు పైనుండి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం.. ముదిగొండ గ్రామానికి చెందిన యాదయ్య ప్రతిరోజు తాటి చెట్లు ఎక్కి కల్లు గీస్తుండగా అకస్మాత్తుగా చెట్టు పైనుంచి ఒక్కసారిగా కిందపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.