»World Cup 2023 India Who Is Ready For The First Fight In The World Cup Today Collided With The Ausis
WORLD CUP 2023 : వరల్డ్ కప్లో నేడు తొలి పోరుకు సిద్ధమైన భారత్.. ఆసీస్తో ఢీ
ఆస్ట్రేలియాతో నేడు భారత్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభకానుంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో భారత్కు ఇదే తొలి మ్యాచ్. టీమిండియాలో గిల్, పాండ్యాలు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. భారత్కు ఆస్ట్రేలియా గట్టి పోటీని ఇవ్వనుంది.
వరల్డ్ కప్ టోర్నీలో నేడు ఆసీస్ (Astralia)తో భారత జట్టు ఢీకొనబోతోంది. తన తొలి పోరులోనే ఆసీస్తో తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు హాట్ స్టార్ (Hotstar)లో ఈ మ్యాచ్ ప్రసారం కానుంది.
ఇకపోతే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా (TeamIndia)కు వరుస షాకుల మీద షాకులు తగిలాయి. యంగ్ బ్యాటర్, టీమిండియా ఓపెనర్ అయిన శుభ్మన్ గిల్ (SubhmanGill)కు డెంగ్యూ జ్వరం (Dengue fever) వచ్చింది. దీంతో గిల్ ఈ మ్యాచ్కు దూరం అయ్యాడు. మరోవైపు నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు గాయం అయ్యింది. దీంతో పాండ్యా ఆడటం కూడా అనుమానంగానే ఉంది. మరి నేటి మ్యాచ్లో ఎవరెవరు ఆడనున్నారో చూడాల్సి ఉంది.