One Day World Cup: వన్డే వరల్ట్ కప్ (One Day World Cup) మూడో మ్యాచ్లో రికార్టుల మోత మోగింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ తీసుకుంది. అలా తీసుకోవడమే తప్పు అయిపోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశారు. ఢిల్లీ స్టేడియం నలువైపులా ఫోర్ల మోత మోగించారు. సిక్సుల సునామీ కొనసాగింది. మ్యాచ్లో ముగ్గురు ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డు సృష్టించారు.
ఓపెనర్ డికాక్ 84 బంతుల్లో సెంచరీ చేశాడు. 3 సిక్సులు, 12 ఫోర్లు బాదాడు. సెంచరీ తర్వాత అవుటయ్యాడు. డస్సెన్ కూడా 2 సిక్సులు, 13 ఫోర్లతో ఊచ కోత కోశాడు. 108 పరుగులు చేసి వెనుదిరిగాడు. మార్కమ్ అయితే లంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ చేశాడు. 3 సిక్సులు, 14 ఫోర్లతో 106 రన్స్ చేసి ఔటయ్యాడు. ముగ్గురు బ్యాట్స్ మెన్ సెంచరీలు బాదడంతో సౌతాఫ్రికా స్కోర్ 400 దాటింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది.