PLD: పెదకూరపాడులో సీఎం సహాయనిధి కింద 11 మంది లబ్ధిదారులకు రూ.10.61 లక్షల చెక్కులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అందజేశారు. ఈ నిధి నిరుపేదలకు వరంగా మారిందని ఆయన అన్నారు. దీని ద్వారా నియోజకవర్గంలో వందలాది మంది మెరుగైన వైద్యం పొందుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.