దేశంలో చాలా చోట్ల డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. ఎక్కడ చూసినా దోమల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఒక వ్యక్తి చేసిన పనికి వైద్యులు అవక్కాయ్యారు. అయితే ఏం చేశాడో ఇప్పుడు చుద్దాం.
Dengue cases in West Bengal, the person who brought mosquitoes to the hospital.. Shocked doctors
Viral news: దోమల వలన వచ్చే రోగాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సీజన్ ఇది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ( West Bengal) రాష్ట్రంలో డెంగీ కేసులు గత రెండు వారాల నుంచి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంలో ఓ వ్యక్తి తనను కుట్టిన దోమల (mosquitoes)ను సేకరించి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. దీంతో డాక్టర్తో సహ అక్కడున్నవారంతా షాక్కు గురయ్యారు. ఈ ఘటన పుర్బా బర్దామన్ జిల్లాలో చోటు చేసుకుంది.
మంగళకోట్కు చెందిన మన్సూర్ అలీ షేక్ అనే వ్యక్తి చిన్న వ్యాపారం చేసుకుంటాడు. తన దుకాణం పక్కన నిల్వ ఉన్న నీటిలో దోమల బెడద పెరిగింది. దీంతో అతడు భయంతో తనను కుట్టిన దోమలను సేకరించి ఓ ప్లాస్టిక్ కవర్లో వేసుకుని నేరుగా స్థానిక ఆసుపత్రికి వచ్చాడు. వాటిని వైద్యుడికి చూపించాడు. ఈ దోమలను పరీక్షించి ముందస్తుగా తనకు సరైన వైద్యం చేయాలంటూ కోరాడు. దీంతో వైద్యుడు సహా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక అధికారులు తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని తెలిపారు. అంతేకాకుండా దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.