»Tdp Leader Acchem Naidu Released The Skill Development Book
Acham Naidu: పిచ్చి జగన్..పిచ్చి మంత్రుల తప్పుడు ఆరోపణలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి వైసీపీ నేతలు పిచ్చి ఆనందం పొందుతున్నారని..అసలు విషయాలను ప్రజల ముందుకు తీసుకురావడానికే ఈ మూడు బుక్‌లను ముద్రించినట్లు టీడీపీ సీనియర్ నేత అచ్చెం నాయుడు పేర్కొన్నారు.
TDP leader Acchem Naidu released the skill development book
Acchem Naidu: తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన, మచ్చలేని గొప్ప నాయకుడు చంద్రబాబు(Chandrababu) అని టీడీపీ సీనియర్ నేత అచ్చెం నాయుడు(Acchem Naidu) తెలిపారు. నాలుగు దశబ్దాలుగా ప్రజా జీవితంలో నిర్విరామంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని నిరాధార ఆరోపణలతో జైలుకు పంపించారని.. గడిచిన 28 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో ఉండడంతో నిజంగా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దేశానికి, ప్రపంచానికి తెలిసేలా ఆంధ్రప్రజలతో పాటు ప్రపంచదేశాల్లో ఉన్న ఆయన అభిమానులు నిరసనలు తెలిపారని వివరించారు.
కనీసం ఒక్క నోటీసు ఇవ్వకుండా, ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు అర్థరాత్రి స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు. ఫస్ట్ డే నుంచి తాను ఏ తప్పు చేయలేదని చెప్తున్నామని, తన జీవితంలో చిన్న తప్పు కూడా చేయరని..తప్పు చేసే వారిని విడిచిపెట్టరని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై పిచ్చి జగన్(YS Jagan), పిచ్చి మంత్రులు తప్పుడు ఆరోపణలు చేసి అవాక్కులు చెవాక్కులు పేలుస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై అచ్చెంనాయుడు మండిపడ్డారు. స్కీల్ కేసులో రూ.3300 కోట్లకు చంద్రబాబు అవినీతి చేశారని అన్నారు. తరువాత రూ. 330 కోట్లు అవినీతి చేశారని చెప్పారు. ఇప్పుడు తాజాగా రూ.27 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. అవి కూడా పార్టీ అకౌంట్లో డబ్బులు పడ్డాయని, పార్టీ అకౌంట్లో పడిన డబ్బు అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆరోపణల్లో నిజా నిజాలను తేల్చడానికి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు టీడీపీ పుస్తకాలు(Books) ప్రచురించాలని నిర్ణయించామని తెలిపారు. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై తొలి పుస్తకాన్ని అచ్చెం నాయుడు రిలీజ్ చేశారు. స్కిల్ పై నిందలు వేయడమంటే..యువత భవితపై దాడి చేయడమేనని టీడీపీ ముద్రించిన పుస్తకాన్ని మీడియాకు చూపించారు. ఈ పుస్తకాన్ని జనాలకు అందించి, స్కిల్ డెవలప్ మెంట్ లో ఏం జరిగిందనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్తామని అచ్చెం నాయుడు పేర్కొన్నారు.