WGL: 19వ డివిజన్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో రూ.29.70 లక్షల వ్యయంతో బి.టి ఫ్లోరింగ్ నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి..తీర్థ ప్రసాదాల స్వీకరించారు. ఈ సందర్భంలో ఆమె వెంట మేయర్ సుధారాణి ఉన్నారు.